కస్టమ్స్‌ చేతికి చిక్కిన 16 అరుదైన పాములు వీడియో

Updated on: Jul 05, 2025 | 3:05 PM

ప్రయాణికుల్లా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని చూస్తుంటాం. వీరు బంగారం, మాదకద్రవ్యాలను తరలిస్తూ కస్టమ్స్‌ అధికారులకు దొరుకుతుంటారు. ముంబై విమానాశ్రయంలో థాయిలాండ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు అరుదైన పాములను స్మగ్లింగ్‌ చేస్తూ భారత కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కాడు.

కస్టమ్స్‌ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. garter పాములు, rhino rat స్నేక్‌ ఇంకా ఓ Kenyan sand boa వాటిలో ఉన్నట్లు గుర్తించారు. వీటిని పెంపుడు జంతువులుగా కొనుగోలు చేస్తుంటారు. ఈ సజీవ పాములు విషపూరితం కావని అధికారులు తెలిపారు. థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ విషపూరిత పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్న కొద్ది రోజులైనా కాలేదు. బల్లులు, సన్‌బర్డ్స్‌, ఇతర వందకు పైగా జీవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్‌ భారత్‌ మార్గంలో దాదాపు 7 వేల వన్యప్రాణులను గత మూడున్నరేళ్లలో అధికారులు సీజ్‌ చేసారు.

మరిన్నివీడియోల కోసం :

సీసీటీవీలో భార్యాభర్తల అరుపులు..ఆ మరునాడే .. ఏం జరిగిందంటే వీడియో

ఐదేళ్లుగా సినిమాల్లేవ్…ఇప్పుడు ఒక్కో మూవీకి రూ. 40 కోట్లు వీడియో

ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? వీడియో