RBI: కస్టమర్లు బీ అలెర్ట్.! ఇకపై ఆ బ్యాంక్ కనిపించదు..
న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరగకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో.. ఉదయం నుంచి బ్యాంక్ ముందు ఖాతాదారుల క్యూ కట్టారు. తమ సేవింగ్స్‌ను విత్‌డ్రా చేసుకోనివ్వాలని కోరుతున్నారు. దీనిపై బ్యాంక్ అధికారులు స్పందించకపోవడంతో.. అంధేరీలోని విజయనగర్ బ్రాంచ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
ముంబై కేంద్రంగా నడిచే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. బ్యాంక్‌ను వెంటనే మూసేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆరు నెలల వరకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు ఎలాంటి లావాదేవీలు జరపవద్దని తెలిపింది. సేవింగ్స్, కరెంటు ఖాతాలే కాకుండా.. ఎలాంటి ఇతర ఖాతాల్లోని డబ్బును విత్‌డ్రా చేయడానికి కాని.. డిపాజిట్ చేయడానికి కాని వీల్లేదని తెలిపింది. ఈ ఆర్బీఐ ప్రకటనతో ఉదయం నుంచి బ్యాంక్ ఎదుట ఖాతాదారులు వేచిచూస్తున్నారు. తమ సేవింగ్స్ డబ్బును ఇప్పించాలని కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం బ్యాంకుకు తాళాలు వేసి.. ఎలాంటి విత్‌డ్రాలు కుదరవని తెగేసి చెబుతున్నారు. దీంతో అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంక్ ఎదుట బైఠాయించిన ఖాతాదారులు తమ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

