అమ్మతో ప్రతి క్షణం విలువైనదే.. ఆయుష్షును పెంచేదే

Updated on: Nov 02, 2025 | 6:48 PM

అమ్మ అంటే ఓ మధుర అనుబంధం. అమ్మ అంటే కొండంత ధైర్యం. ప్రపంచంలో దేనితోనూ పోల్చలేనంత ప్రేమను పంచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. అలాంటి అమ్మ గురించి ఆసక్తికర విషయాన్ని అమెరికాలోని వుమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ వెల్లడించింది . అమ్మ ప్రేమను పొందడమే కాదు, అమ్మకు ప్రేమను పంచడం కూడా పిల్లలకు ఆనందాన్ని, ఆమెకు ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

కూతుళ్లైనా, కుమారులైనా అమ్మతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఆమె జీవిత కాలాన్ని పొడిగించవచ్చని, ముఖ్యంగా కూతుళ్లతో ఈ ప్రయోజనం మరింత అధికంగా ఉంటుందని వుమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ అధ్యయనం తెలిపింది. అమ్మకు కాస్త వయసు పైబడిన సమయంలో ఆమెతో స్పెండ్‌ చేయడం చాలా మేలు చేస్తుందట. ప్రతీ నవ్వు, ప్రతీ సంభాషణ, ప్రతీ పాజిటివ్‌ భావోద్వేగం, నీకు మేమున్నామనే భరోసా అమ్మలో కలిగించే ఆనందం అంతా ఇంతా కాదనీ పైగా ఈ క్షణాలు ఆమెలో మానసిక ఆనందాన్ని ఆయుష్షును పెంచుతాయని పరిశోధనలో తేలింది. అమెరికాలోని వుమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ పరిశోధకులు కూతుళ్లు తల్లితో స్పెండ్ చేసే సమయం తల్లిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు. ఇందుకోసం 22,000 మంది మహిళల డేటాను ఎనలైజ్ చేశారు. 90 సంవత్సరాల వరకు జీవించిన మహిళల ఆయుఃప్రమాణానికి గల కారణాలను విశ్లేషించినప్పుడు, కూతుళ్లు వారితో స్పెండ్ చేయడం వల్లే అది సాధ్యమైందని తేలింది. సాధారణ మహిళలతో పోలిస్తే.. కూతుళ్లు తల్లితో ఎక్కువ సమయం గడపడం వల్ల తల్లుల్లో జీవించే అవకాశం 25% పెరిగిందని ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారు

పగలు టెకీలు.. రాత్రయితే క్యాబ్‌ డ్రైవర్లు .. ఏంటీ నయా ట్రెండ్

చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే

జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్..

ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. అనంత విశ్వంలో తేలియాడుతారు!