Roja Dance: థీంసా నృత్యంతో దుమ్మురేపిన మంత్రి రోజా..! వీడియో అదుర్స్.
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా తనదైన శైలితో రాణిస్తున్నారు. తాజాగా విశాఖలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించారు.
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా తనదైన శైలితో రాణిస్తున్నారు. తాజాగా విశాఖలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ టూరిజం మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గిరిజన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో రోజాకు నిర్వాహకులు స్వాగతం పలికారు. సభలోనే వేదికపై గిరిజన జానపద గీతానికి రోజా డాన్స్ చేశారు. విద్యార్థులు థీంసా నృత్యం చేస్తుంటే వారితో కాలు కదిపారు. విద్యార్థుల డ్యాన్సుకు ఏ మాత్రం తీసిపోకుంట స్టెప్పులేశారు మంత్రి రోజా. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు ఆందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం పాల్గొన్న కళాకారులకు ప్రశంస పత్రాలను అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
Published on: Dec 21, 2022 09:53 AM