రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు

|

Jan 15, 2024 | 6:33 PM

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనుంది. ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనుంది.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనుంది. ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనుంది. మారిషస్ జనాభాలో 48.5శాతం హిందువులు ఉన్నారు. సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఇదో చిన్న ప్రయత్నమని మారిషస్ పీఎం ప్రవింద్ జగ్నాథ్ పేర్కొన్నారు. భారత్‌లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయడానికి మంత్రివర్గం అంగీకరించినట్లు ప్రధాన మంత్రి ప్రవింద్ జగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం

స్కూల్‌ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!

ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి

అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్‌ ఫ్రెండ్‌ ఏం చేశాడంటే ??

AI టెక్నాలజీతో అక్కినేనిని మోడర్న్‌ ఫొటోలు.. నెట్టింట ట్రెండ్