Guava leaves: జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామకాయను పేదవాడి యాపిల్ అంటారు ....ప్రతి రోజూ ఒక జామకాయ తినటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారు కచ్చితంగా రోజూ జామకాయ తినమని సూచిస్తున్నారు.. పోషకాలు పుష్కలంగా ఉండి, అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది జామకాయ. కేవలం జామ కాయలే కాదు జామ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. జామ ఆకుల్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, డైటరీ మినరల్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల మధుమేహంలో మేలు చేస్తుంది. బ్లడ్‌షుగర్ అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జామ ఆకు రసంలో ఉండే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తాయి. పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. జామ ఆకుల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకులను నమలడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా రోగనిరోధకశక్తి పెంచుతుంది. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొట్టతో నమిలితే ఎక్కువ ప్రయోజనాలు శరీరానికి అందుతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఆ ఆకులను రెండు...