మల్కాజిగిరి పోలీసుల మాస్టర్ ప్లాన్..హెల్మెట్ లేని వారికి బంపర్ ఆఫర్!

Updated on: Mar 03, 2026 | 3:55 PM

మల్కాజిగిరి పోలీసులు రోడ్డు భద్రతపై జరిమానాలకే పరిమితం కాకుండా, హెల్మెట్ బ్యాంక్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్ లేని వారికి తాత్కాలికంగా హెల్మెట్‌ను అందించి, సాయంత్రంలోపు కొత్తది కొనుగోలు చేయమని సూచిస్తున్నారు. మార్పు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం జరిమానాలు విధించడం కాకుండా, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా హెల్మెట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ అవినాష్ మహంతి సూచనల మేరకు వాయుపురిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను ఆపి, పోలీసులు సహనంతో వారికి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ బ్యాంక్ ద్వారా వారికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Follow Us