Kargil War: ఆ క్షణం ఎంతో మధురం.. 1999 కార్గిల్ యుద్ధం.. ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్

|

Jul 26, 2024 | 11:40 AM

1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది గాయపడ్డారు. అయితే ఆ సమయంలో కాశ్మీర్‌లోని ఉదంపూర్‌ కమాండ్‌ ఆస్పత్రిని నరేంద్ర మోడీ సందర్శించారు. గాయపడిన వారిని పరామర్శించారు. అయితే ఆ సమయంలో మోడీతో పాటు మేజనర్‌ జనరల్‌ విజయ్‌ జోషి (రిటైర్డ్‌) కూడా ఉన్నారు. ఈ రోజు భారతదేశానికి ఒక చారిత్రాత్మక సందర్భం, 25వ కార్గిల్ విజయ్ దివస్ మన సైనికుల త్యాగం, పరాక్రమానికి దేశం

1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది గాయపడ్డారు. అయితే ఆ సమయంలో కాశ్మీర్‌లోని ఉదంపూర్‌ కమాండ్‌ ఆస్పత్రిని నరేంద్ర మోడీ సందర్శించారు. గాయపడిన వారిని పరామర్శించారు. అయితే ఆ సమయంలో మోడీతో పాటు మేజనర్‌ జనరల్‌ విజయ్‌ జోషి (రిటైర్డ్‌) కూడా ఉన్నారు. ఈ రోజు భారతదేశానికి ఒక చారిత్రాత్మక సందర్భం, 25వ కార్గిల్ విజయ్ దివస్ మన సైనికుల త్యాగం, పరాక్రమానికి దేశం నివాళులు అర్పిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ద్రాస్‌ను సందర్శించి కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉధంపూర్‌లోని మిలిటరీ కమాండ్ హాస్పిటల్ కమాండెంట్‌గా పనిచేసిన మేజర్ జనరల్ విజయ్ జోషి 1999లో అప్పటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోదీ గాయపడిన, యుద్ధంలో అలసిపోయిన సైనికులను కలుసుకునేందుకు చేసిన ముఖ్యమైన పర్యటనను గుర్తు చేసుకున్నారు. నార్తర్న్ కమాండ్‌లో అతిపెద్దదైన ఈ ఆసుపత్రి కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులకు సంరక్షణ అందించడంలో ముందంజలో ఉందని ఆయన అన్నారు.

Follow us on