నాడు వందలాది సినిమాల ఫేవరెట్ స్పాట్..నేడు దీనస్థితిలో ఈ ప్రాంతం వీడియో
కోనసీమకు జీవనాడిగా నిలిచిన లొల్ల లాకులు శిథిలావస్థకు చేరాయి. కాటన్ దొర నిర్మించిన ఈ లాకులు 2 లక్షల ఎకరాలకు నీరందిస్తూ, సినిమాలకు వేదికయ్యాయి. పాలకుల నిర్లక్ష్యంతో కూలిపోయే ప్రమాదంలో ఉన్న వీటి పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించినా పనులు జరగడం లేదు. తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
ఆత్రేయపురం మండలంలోని గోదావరి సెంట్రల్ డివిజన్‌కు చెందిన లొల్ల లాకులు ఒకప్పుడు కోనసీమకే గుండెకాయ లాంటివి. కాటన్ దొర 1883లో నిర్మించిన ఈ లాకులు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, 8 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చాయి. అనేక సినిమాలకు చిత్రీకరణ ప్రదేశంగా కూడా నిలిచాయి.అయితే, దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఈ లాకులు నేడు తీవ్ర శిథిలావస్థకు చేరాయి. నీటి పంపిణీలో కీలకంగా ఉండే లాకుల తలుపులు విరిగిపోయాయి, రాతి కట్టుబడి దెబ్బతింది. వాహనాలు వెళ్లే మార్గంలో స్లాబులు కూలిపోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
