భారత్‌లో బద్దలైన అగ్నిపర్వతం వైరల్ అవుతున్న వీడియో
అండమాన్ నికోబార్ దీవుల్లోని బరాటాంగ్ వద్ద సుమారు 20 ఏళ్లకు పైగా నిద్రాణంగా ఉన్న మట్టి అగ్నిపర్వతం అక్టోబర్ 2న బద్దలైంది. చివరిసారిగా 2005లో విస్ఫోటనం చెందిన ఈ అగ్నిపర్వతం కారణంగా మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఏర్పడ్డాయి. పోలీసులు, అధికారులు స్థానికులను, పర్యాటకులను అప్రమత్తం చేశారు.
భూమి లోపల దాగి ఉన్న అపారమైన శక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు అగ్నిపర్వతాలు. తాజాగా, సుమారు 20 ఏళ్లకు పైగా నిద్రాణంగా ఉన్న భారతదేశంలోని ఏకైక మట్టి అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బరాటాంగ్ వద్ద బద్దలైంది. అక్టోబర్ 2న భారీ శబ్దంతో విస్ఫోటనం చెందిన ఈ అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఎగిసిపడ్డాయి. దాదాపు 1000 చదరపు మీటర్లకు పైగా బూడిద వ్యాపించింది. ఈ మట్టి అగ్నిపర్వతం చివరిసారిగా 2005లో బద్దలైంది. ఈ విస్ఫోటనం నేపథ్యంలో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిపర్వతం ఉన్న ప్రాంతం వైపు అన్ని రాకపోకలను నిలిపివేసి, స్థానికులతో పాటు పర్యాటకులను అలెర్ట్ చేశారు. భూమిపై ఉన్న టెక్టానిక్ ప్లేట్ల కదలికలే ఇటువంటి అగ్నిపర్వత విస్ఫోటనాలకు ప్రధాన కారణం.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
