Telangana: పరిగిలో రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్

Updated on: Aug 03, 2024 | 11:57 AM

పరిగి మున్సిపాలిటీ పరిధిలో బాలాజీ నగర్ కాలనీ వాసుల నిరసన ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. రహదారిలో భారీ వర్షాలకు ఏర్పడిన గుంతల్లో వరినాట్లు వేసి స్థానికులు నిరసన చేపట్టారు. వాహనదారులు ఆ గుంతల్లోపడి గాయపడుతున్నారని వాపోయారు.

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో బాలాజీ నగర్ కాలనీ వాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి బాగు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. గుంతల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలిపారు స్థానికులు. వర్షాకాలం ప్రారంభం నుంచి కాలనీకి వెళ్లే దారి గుంతలమయమై చిత్తడిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య జనం రోడ్డుపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు ఆధ్వాన్న స్థితిలో ఉన్నాయంటూ తెలుపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Aug 03, 2024 11:57 AM