వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ జోరుగా మహిళల పూజలు

|

Sep 01, 2024 | 10:33 AM

పాలు కారుతున్న దృశ్యాన్ని చూడటానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో వేప చెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. కొంతమంది ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. కొందరు చెట్టు నుంచి పాలు కారుతున్న ఈ విచిత్రాన్ని మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నారు. విరామం లేకుండా పాలు కార‌డం చూసి ఇది నిజంగా దైవ మ‌హిమే అంటూ అనేక మంది మహిళలు వేప చెట్టు చుట్టూ పసుపు, కుంకుమ రాసి, పూలు పెట్టి పూజలు చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వేప చెట్టుకు ధారగా పాలు కారుతున్నాయి. ఈ వార్త కాస్త ఆ నోట ఈ నోట ప‌రిస‌ర‌ప్రాంతాల్లో దావానంలా వ్యాపించింది. ఇక ఈ వింత ఘ‌ట‌న చూసేందుకు ప్ర‌జ‌లు భారీగా తరలి వ‌స్తున్నారు. పాలు కారుతున్న దృశ్యాన్ని చూడటానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో వేప చెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. కొంతమంది ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. కొందరు చెట్టు నుంచి పాలు కారుతున్న ఈ విచిత్రాన్ని మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నారు. విరామం లేకుండా పాలు కార‌డం చూసి ఇది నిజంగా దైవ మ‌హిమే అంటూ అనేక మంది మహిళలు వేప చెట్టు చుట్టూ పసుపు, కుంకుమ రాసి, పూలు పెట్టి పూజలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on