Coffee: కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?

Coffee: కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Dec 11, 2024 | 10:50 AM

ఉదయాన్నే కాఫీ తాగనిదే రోజు మొదలవదు చాలామందికి. ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగితే రీఫ్రెష్‌గా అనిపిస్తుంది.. శరీరం చురుకుదనాన్ని సంతరించుకొని ఉత్సాహంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. ఇంతవరకే మనకు తెలుసు.. కానీ కాఫీ మన ఆయుష్సును కూడా పెంచుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. కాఫీ తాగడం ద్వారా మన జీవితకాలంలో మరో రెండేళ్ళు ఆయుష్షు పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

గతంలో ప్రచురితమైన అధ్యయనాన్ని సమీక్షించిన అనంతరం ఈ విషయం చెప్పింది. కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన ఈ అధ్యయన వివరాలు ‘ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. కాఫీ తాగడం వల్ల ఒకరి జీవితానికి అదనంగా ఆరోగ్యకరమైన మరో 1.8 సంవత్సరాలు కలుస్తాయని పోర్చుగల్ అధ్యయనకారులు తెలిపారు. ఆరోగ్యకరమైన, సమతుల జీవనశైలిలో కాఫీ ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా వృద్ధ దశకు చేరుతోందని.. ఈ నేపథ్యంలో ప్రజలు దీర్ఘకాలం జీవించడమే కాకుండా, ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని కోయింబ్రా యూనివర్సిటీ ముఖ్య పరిశోధకుడు రోడ్రిగో చుంచా తెలిపారు. హృద్రోగం, దీర్ఘకాల వ్యాధులు వంటి వివిధ కారణాలతో మరణించే ముప్పును కాఫీ తగ్గిస్తుందని విస్తృతంగా జరిగిన పరిశోధనలో తేలినట్టు చెప్పారు. కాఫీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లమేటరీ ప్రయోజనాలు సహా 2,000కుపైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతోపాటు ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.