పోలీసులు వన్ సైడ్ తీసుకున్నారంటూ మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. తనకు భద్రత కల్పిస్తున్న వారిని బయటకు పంపించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనిపై తాను అందరినీ కలుస్తానని పేర్కొన్నారు. ముందుగా తానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పిస్తామని మాట ఇచ్చిన పోలీసులు.. ఇప్పుడు మాట తప్పారని అసంతృప్తి వ్యక్తంచేశారు.