నా ప్రపంచం ఇదే అని అస్సలు ఊహించలేదు : నయనతార వీడియో
నయనతార సినీ ప్రవేశం చేసి 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ వైరల్ అయింది. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి, సినిమా తన ప్రపంచం అవుతుందని ఊహించలేదని నయనతార పేర్కొంది. తనను తాను తెలుసుకునేందుకు ఈ ప్రయాణం తోడ్పడిందని, ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన నటిస్తోంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార సినీ రంగ ప్రవేశం చేసి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.తొలిసారి కెమెరా ముందుకు వచ్చి 22 ఏళ్లు గడిచిందని నయనతార తన పోస్టులో తెలిపారు. ఇండస్ట్రీలోకి అనుకోకుండానే అడుగు పెట్టానని, సినిమాలు తన ప్రపంచం అవుతాయని అస్సలు ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. కానీ, తన కెరీర్ లోని ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ తనకు అండగా నిలిచాయని, ధైర్యాన్ని ఇచ్చాయని నయనతార చెప్పారు. తనను తాను తెలుసుకునేలా ఈ ప్రయాణం చేసిందని, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
