Kokapet: కోకాపేటలో రికార్డు ధర పలికిన ప్లాట్లు

Updated on: Nov 24, 2025 | 8:49 PM

హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్‌లో HMDA నిర్వహించిన ప్లాట్ల వేలం రికార్డు ధరలు పలికింది. ప్లాట్ నంబర్ 17, 18 లకు ఎకరానికి ₹136.50 కోట్లు, ₹137.25 కోట్లు లభించాయి. ఈ వేలం ద్వారా HMDAకి ₹1355 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రాబోయే దశల్లో మరింత ఆదాయం అంచనా వేయబడుతోంది, కోకాపేట వాణిజ్య కేంద్రంగా మారనుంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి బూమ్ బూమ్ అంటూ దూసుకెళ్తోంది. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట నియోపోలిస్‌లో HMDA నిర్వహించిన ప్లాట్ల వేలంలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ప్లాట్ నంబర్ 17 (4.59 ఎకరాలు)కు ఎకరానికి ₹136.50 కోట్లు, ప్లాట్ నంబర్ 18 (5.31 ఎకరాలు)కు ఎకరానికి ₹137.25 కోట్ల చొప్పున ధర లభించింది. ఈ రెండు ప్లాట్ల అమ్మకం ద్వారా HMDAకి మొత్తం ₹1355.33 కోట్ల ఆదాయం లభించింది. నియోపోలిస్‌లో ఎకరానికి ₹99 కోట్ల ప్రారంభ ధర నిర్ణయించగా, అంచనాలను మించి ధరలు పలికాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రమాదాలమయంగా హైదరాబాద్ – విజయవాడ హైవే

Chandrababu Naidu: అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన AP CM

గుడ్‌ న్యూస్‌.. బంగారం, వెండి ధరలు తగ్గాయి

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ

సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్