EPFO Rules: పీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి పెన్షన్‌ వస్తుందా..? నిబంధనలు ఏమిటి.?

|

May 22, 2022 | 8:29 AM

ప్రతి నెలా మీ జీతం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయా? అయితే మీకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. ఉద్యోగం చేసే వ్యక్తి జీతంలో


ప్రతి నెలా మీ జీతం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయా? అయితే మీకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. ఉద్యోగం చేసే వ్యక్తి జీతంలో కొంత భాగాన్ని పీఎఫ్‌గా కట్‌ చేస్తారు. కట్‌ అయిన డబ్బు పీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. ఒక ఉద్యోగి బేసిక్‌ వేతనం నుంచి 12 శాతం మొత్తాన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌కు కంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. ఈ 12 శాతం షేర్‌లో 8.33 శాతం ఈపీఎస్‌లో డిపాజిట్ అవుతుంది. ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి అంటే భార్య , పిల్లలకు ప్రతి నెలా కుటుంబ పెన్షన్ అందజేస్తారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. EPS 95 పథకం కింద ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబం అంటే అతని భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్‌కి అర్హులవుతారని ట్వీట్‌ చేసింది. ఏదైనా ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో గానీ ఖాతాదారుడు మరణిస్తే EPS 95 ప్రకారం.. అతని కుటుంబానికి కనీసం 1,000 రూపాయల చొప్పున నెలవారీ పెన్షన్ లభిస్తుంది. అలాగే పీఎఫ్‌ ఖాతాదారుడికి వివాహం కానట్లయితే పీఎఫ్ నామినీ ఎవరైతే ఉన్నారో వారు జీవితాంతం పెన్షన్‌ పొందవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Follow us on