Rains in Visakha Video: గంట వర్షానికే… వాగులా మారిన విశాఖ కాలనీలు..! వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Sep 22, 2021 | 5:16 PM

విశాఖ అంటే… సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. సుందర నగరంగా, స్మార్ట్ సిటీగా అందరి మదిలో మెదులుతుంది సాగర నగరం. కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే చినుకు పడితే చాలు వణుకుపుట్టే పరిస్థితి నగరంలోని చాలా చోట్ల కనిపిస్తుంది...

విశాఖ అంటే… సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. సుందర నగరంగా, స్మార్ట్ సిటీగా అందరి మదిలో మెదులుతుంది సాగర నగరం. కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే చినుకు పడితే చాలు వణుకుపుట్టే పరిస్థితి నగరంలోని చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని మధురవాడలో హైవే పై నిర్మించిన బ్రిడ్జి కింద రహదారి నదిని తలపించేలా తయారైంది.

వరద ప్రవాహంకి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వాహనదారులు కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు ఏదో మారుమూల గ్రామాలలోనిదో.. లేదా ఏజెన్సీ ప్రాంతంలోనిదో అనిపించే పరిస్థితి తలెత్తింది. కాగా, వర్షపు నీటి ప్రవాహంకి రోడ్డుపై ప్రయాణించే పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వెంటనే స్థానికులు స్పందించి సహకారం అందించడంతో వాహనదారులు సేఫ్‌గా బయటపడ్డారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Virat Kohli Video: విరాట్‌ కోహ్లీ మరోసంచలన నిర్ణయం..ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇదే తన చివరి…..(వీడియో)

 Sonu sood tweet: ఐటీ దాడులపై సోనూసూద్‌ భావోద్వేగ ట్వీట్..! వైరల్ అవుతున్న వీడియో..

 5 doses vaccine Video: ‘5 డోసులు ఇచ్చాం.. ఆరో డోసుకు ఆ రోజు రండి..!’ సర్టిఫికెట్‌ చూసి షాకైన వ్యక్తి..(వీడియో)

 Viral Video: ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన మహిళ… కట్‌చేస్తే ఉద్యోగం ఊస్ట్.. అసలేం జరిగిందంటే..(వీడియో)