Tomato flu: పేరెంట్స్ బీ అలెర్ట్..! చిన్నారులకు కొత్త వైరస్‌.. వెంటాడుతున్న టమాటా ఫ్లూ..!

|

May 31, 2022 | 9:44 AM

కరోనా సృష్టించిన విలయం నుంచే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రోజుకో కొత్త స్ట్రెయిన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా, ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్‌లు..ఇలా రోజుకో వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.


కరోనా సృష్టించిన విలయం నుంచే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రోజుకో కొత్త స్ట్రెయిన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా, ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్‌లు..ఇలా రోజుకో వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా టమాటా ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న కేరళ.. నేను ఒడిషా.. చిన్నారులను వెంటాడుతోంది టమాట ఫ్లూ. మొన్నటివరకు కేరళను వణికించిన ఈ ఫ్లూ..ఇప్పుడు ఒడిశాపై పంజా విసురుతోంది. ఒక్కరోజే 26 కేసులు బయటపడటం టెన్షన్‌ పెడుతోంది.మే ప్రారంభంలో కేరళలో వెలుగుచూసిన ఈ టమాటా ఫ్లూ..ఇప్పుడు ఒడిశాలో దడ పుట్టిస్తోంది. HFMDగా పిలిచే ఈ వ్యాధి చిన్నారులకు సోకుతుంది. భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్​ రీసెర్చ్ సెంటర్​లో..36 నమూనాలను పరీక్షించగా.. 26మందికి పాజిటివ్‌గా తేలింది. చిన్నారుల చేతులు, పాదాలు, నోరు, పెదవుల మీద టమాటో ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వారిని ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉంచామని.. వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ అంటువ్యాధి పేగు వైరస్‌ల వల్ల.. ఇది ఎక్కువగా చిన్నారుల్లోనే వస్తుంది. పెద్దవారిలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Follow us on