Superbug: కరోనాను మించిన కొత్త మహమ్మారి.. తల పట్టుకుంటున్న డాక్టర్స్.. 60వేల మంది ఈ వ్యాధితో మరణం..

Updated on: Oct 17, 2022 | 9:51 AM

దేశంలో కొత్త టెన్షన్‌ మొదలైంది.. కరోనాను మించిన మహమ్మారి డాక్టర్లకు సవాలు విసురుతోంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియా వల్ల సూపర్‌బగ్స్ విజృభిస్తున్నాయి. వీటివల్ల బాధపడుతున్న పేషెంట్లుకి చికిత్స చేయడం డాక్టర్లకు కష్టంగా మారింది.


కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే అల్లాడుతుంది దేశం. ఇలాంటి సమయంలో పుండు మీద కారంలా కరోనాను మించిన మహమ్మారి సూపర్‌ బగ్‌ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2019లో సుమారు 12.7 లక్షల మంది సూపర్‌బగ్స్ వల్ల చనిపోయారని మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ చెబుతోంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. సూపర్‌బగ్స్‌కు ఉండే రెసిస్టెన్స్ శక్తి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏడాది సుమారు 60వేల మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు.అయితే ఇప్పుడు మహారాష్ట్రలోని కస్తూర్బా హాస్పిటల్‌లో సూపర్‌బగ్స్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో డాక్టర్లు తలమునకలవుతున్నారు. ఇ-కోలాయ్, సాల్మోనెల్లా వంటి 5 రకాల బ్యాక్టీరియాలు ప్రధానంగా మనుషులకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. మనుషులు, జంతువుల పేగుల్లో ‘ఇ-కోలాయ్’ బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఊపిరితిత్తులకు సోకే ‘క్లెబ్సియల్లా న్యుమోనియా’ వల్ల న్యుమోనియా సోకుతుంది. ఈ సూపర్‌బగ్స్‌ వల్ల కలిగే వ్యాధులను ట్రీట్ చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావం 15శాతం కంటే తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు తమ పరిశోధనలో గుర్తించారు. దీని కారణంగా రోగులకు చికిత్స అందించడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 17, 2022 09:51 AM
Loading...
Unable to load recommendations.
Follow Us