Stanford Study: ఒక్క రక్తపరీక్షతో అన్ని రోగాలు గుర్తించొచ్చు.! తేల్చిన స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు.

Stanford Study: ఒక్క రక్తపరీక్షతో అన్ని రోగాలు గుర్తించొచ్చు.! తేల్చిన స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు.

Anil kumar poka

|

Updated on: Dec 13, 2023 | 5:36 PM

కారు, ఇల్లు తరహాలో మన శరీరంలోని అవయవాలూ క్రమంగా క్షీణతకు లోనవుతుంటాయి. అయితే, ఈ ప్రక్రియలో సారూప్యత ఉండదు. ఒక్కో భాగంలో ఒక్కోలా క్షీణత ఉంటుంది. అందువల్ల వాటి వార్ధక్య రేటు భిన్న రీతుల్లో ఉంటోందని అమెరికాలోని ‘స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌’ శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే వయసువారితో పోలిస్తే ఒక వ్యక్తిలో ఏదైనా అవయవం వయసు ఎక్కువగా ఉంటే.. అతడిలో ఆ భాగానికి సంబంధించిన వ్యాధి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తేల్చారు.

కారు, ఇల్లు తరహాలో మన శరీరంలోని అవయవాలూ క్రమంగా క్షీణతకు లోనవుతుంటాయి. అయితే, ఈ ప్రక్రియలో సారూప్యత ఉండదు. ఒక్కో భాగంలో ఒక్కోలా క్షీణత ఉంటుంది. అందువల్ల వాటి వార్ధక్య రేటు భిన్న రీతుల్లో ఉంటోందని అమెరికాలోని ‘స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌’ శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే వయసువారితో పోలిస్తే ఒక వ్యక్తిలో ఏదైనా అవయవం వయసు ఎక్కువగా ఉంటే.. అతడిలో ఆ భాగానికి సంబంధించిన వ్యాధి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారికి అకాల మరణం ముప్పు కూడా ఎక్కువేనని వివరించారు. ఒక సాధారణ రక్తపరీక్ష ఆధారంగా వారిలో అవయవ వార్ధక్య రేటును గుర్తించొచ్చని తేల్చారు. తద్వారా వారిలో వ్యాధి ముప్పును ముందే పసిగట్టవచ్చని తెలిపారు.

రక్త పరీక్ష ద్వారా శరీరంలోని అవయవాల జీవ సంబంధమైన వయస్సును నిర్ధారించవచ్చని వీరు చెబుతున్నారు. అనారోగ్యానికి గురయ్యే ముందే చికిత్స చేసేందుకు ఈ విధమైన రక్త పరీక్ష దోహదం చేస్తుందని తెలిపారు. అంతే కాకుండా అల్జీమర్స్‌ లాంటి వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని, వ్యాధి పురోగతి తీవ్రతను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. ఈ నూతన రక్త పరీక్ష ద్వారా ముందుగానే అవయవాల క్లినికల్‌ లక్షణాలు తెలుసుకుని చికిత్సను అందించే వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.