Gas Cylinder Free: ఉచిత గ్యాస్ కనెక్షన్.. ఇలా అప్లై చేసుకోండి!(Video)
కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వాటిలో పీఎం ఉజ్వల స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన వారు సులభంగా ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందవచ్చు. 2016లో తీసుకొచ్చిన ఉజ్వల స్కీమ్ కింద 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం, 2021 నవంబరు నెలాఖరుకి 8.8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఆగస్ట్ నెలలో మళ్లీ ఉజ్వల స్కీమ్ 2.0 అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద కోటి మందికి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.