Money drawn Without Card: కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా.. కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిన ఎన్‌సీఆర్‌..(వీడియో)

|

Dec 02, 2021 | 9:15 AM

సాధారణంగా ఏటీఎమ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే కచ్చితంగా ఏటీఎమ్‌ కార్డు ఉండాల్సిందే. అయితే పొరపాటున ఏటీఎమ్‌ కార్డ్‌ మర్చిపోతే పరిస్థితి ఏంటి.? అందుకే ఇలాంటి పరిస్థితిలో కూడా డబ్బులు ఈజీగా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ. అదెలా అంటే..


ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్స్‌ ద్వారా మనం డబ్బులను ఒక అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌లోకి పంపగలమని మాత్రమే తెలుసు. అయితే తాజాగా ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ యూపీఐ యాప్‌ ద్వారా ఏటీఎంలో డబ్బులు విత్‌ డ్రా చేసుకునే వెసులు బాటును కల్పించింది.. వినియోగదారుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు యాప్‌లలో కార్డ్‌ లెస్‌ విత్‌డ్రా పేరుతో ఓ ఆప్షన్‌ను అందించాయి. అయితే సదరు బ్యాంకు ఏటీఎమ్‌లో మాత్రమే యూజర్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ ఏటీఎమ్‌లో అయినా కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే బావుంటుంది కదా.. దీనిని దృష్టిలో పెట్టుకునే ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ సహాయంతో ఏదైనా యూపీఐ యాప్‌తో ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ముందుగా ఏటీఎమ్‌లో క్యూఆర్‌ కోడ్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత మీ యాప్‌తో స్కాన్‌ చేసి, అవసరమైన అమౌంట్‌ను ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. అయితే ఈ విధానం ద్వారా 5 వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోగలరు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..