Hyd Onlice class issue: ఆన్‌లైన్ క్లాసులో అగంతకుడు..ఆటకట్టించిన పోలీసులు..!(వీడియో)

|

Jan 07, 2022 | 9:24 AM

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడిప్పుడే... అన్ని వ్యవస్థలు కాస్త కుదుటపడుతున్నాయి....కానీ, పూర్తి స్థాయిలో విద్య సంస్థలు మాత్రం గాడిన పడలేని పరిస్థితి నెలకొంది..దగ్గర దగ్గరగా రెండేళ్లు కావొస్తుంది.


కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడిప్పుడే… అన్ని వ్యవస్థలు కాస్త కుదుటపడుతున్నాయి….కానీ, పూర్తి స్థాయిలో విద్య సంస్థలు మాత్రం గాడిన పడలేని పరిస్థితి నెలకొంది..దగ్గర దగ్గరగా రెండేళ్లు కావొస్తుంది. విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కళ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి టైమ్‌లో కొందరు సైబర్‌ నేరగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు..ఆన్‌లైన్‌ పాఠాలను అడ్డుగా చేసుకుని ఆగంతకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు..హైదరాబాద్‌లోని షేట్‌బషీరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్‌ స్కూల్‌ నిర్వాహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాస్లుల్లో అక్రమంగా చొరబడి అసభ్యంగా ప్రవర్తించిన అగంతకునిపై కేసు నమోదు చేశారు పోలీసులు..

డిసెంబర్‌ 20న టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసు నిర్వహిస్తుండగా, ఓ అగంతకుడు ఆ 7వ తరగతికి సంబంధించిన లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని క్లాసులో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్‌ను కూడా య్యూట్యుబ్‌లో పెట్టాడు. అయితే ఆ అగంతకుడు క్లాస్‌ నడుస్తున్న సమయంలో టీచర్లు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు…దీంతో టీచర్లు ఆ అగంతకుడికి సంబంధించిన లింక్‌ను బ్లాక్ చేశారు. అనంతరం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on