వేలల్లో నమోదవుతోన్న డెంగ్యూ కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్..: Danger Dengue Video.

వేలల్లో నమోదవుతోన్న డెంగ్యూ కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్..: Danger Dengue Video.

Anil kumar poka

|

Updated on: Sep 16, 2021 | 9:44 AM

ప్రపపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా ఇంకా వదలనేలేదు.. దీనికి తోడు సీజనల్‌ వ్యాధులు మేముసైతం అంటూ చెలరేగిపోతున్నాయి. మధ్య ప్రదేశ్‌లో డెంగ్యూ దడదడలాడిస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ పేషంట్లతో అక్కడి హాస్పిటల్స్‌ అన్నీ నిండిపోతున్నాయి...

ఇంకా కరోనా పీడ తొలగనేలేదు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఏదో ఒక మూల పెరుగుతూనే ఉన్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు అప్పుడే డెంగ్యూ దడ మొదలైంది. మధ్యప్రదేశ్‌లో వేల సంఖ్యలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు జనాన్ని భయపెడుతున్నాయి. డెంగ్యూ జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ డెంగ్యూ బాధితులతో నిండిపోతున్నాయి. మొన్నటిదాకా కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన జనం ఇప్పుడు డెంగ్యూతో కకావికలమవుతున్నారు. ఇప్పటివరకూ 2 వేల 400 మంది డెంగ్యూ బారిన పడ్డారు.

ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అవుతున్న రోగుల్లో 20 శాతం మంది డెంగ్యూ బాధితులే. డెంగ్యూ రోగుల్లో ఎక్కువ మంది దోమకాటుకు గురైన వాళ్లే ఉంటున్నారు. మండ్‌సార్‌ జిల్లాలో దోమకాటుతో 800 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఇటు జబాల్‌పూర్‌ జిల్లాలోనూ డెంగ్యూ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇండోర్‌, అగర్‌మాల్వా, రాట్లం జిల్లాల్లోనూ డెంగ్యూ పంజా విసురుతోంది. డెంగ్యూ బారిన పడి ఇప్పటివరకూ పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు.

డెంగ్యూ కేసుల పెరుగుదలతో అప్రమత్తన మధ్యప్రదేశ్ ప్రభుత్వం దోమల నివారణ చర్యల్ని చేపడుతోంది. ఫాగింగ్‌ యంత్రాలతో దోమల ఆవాసాలపై స్ప్రే చేయిస్తోంది. అసలే వర్షాకాలం.. పారిశుద్ధ్య లోపం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నీటి గుంతలు దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తోంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత చూస్తే షాక్‌..! వీడియో వైరల్..: Snake Viral Video.

 రెప్పపాటులో తప్పించుకున్నాడు.. లేకపోతే పాము చేతిలో బలే..!(వీడియో): Snake Attack Viral Video.

 అర్థరాత్రి ‘మృతదేహాల వర్షం’.. జనాలు హడల్‌..!వీడియో వైరల్..: Rain of Corpses Video.

 ఓరేయ్‌.. నన్ను వదిలిపెట్టండ్రా.. నేను స్కూల్‌కు వెళ్లను..!వైరల్ అవుతున్న వీడియో: Little Boy Viral Video.