AP Crime: ఒంగోలులో వెలుగు చూసిన ఘరానా మోసం.. లేడీ హోంగార్డు ఏకంగా డీజీపీ పేరుతో..!(వీడియో)

|

Oct 15, 2021 | 9:05 PM

హోంగార్డుగా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ చీటింగ్ కేసులో ఆమెతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

హోంగార్డుగా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ చీటింగ్ కేసులో ఆమెతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒంగోలులోని కొంత మంది నుంచి నిందితురాలు 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈమె ఏకంగా ఏపీ డీజీపీ, ప్రకాశం ఎస్పీ పేరుతో ఉన్న నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చెట్ల వాణి అనే మహిళ ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయం, పలు పోలీస్ స్టేషన్లలో హోంగార్డుగా పనిచేస్తుంది. ఈజీ మనీకి అలవాటుపడిన ఈమె తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే లక్ష్యంతో నిరుద్యోగులకు గాలం వేసింది. పోలీసు శాఖ ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయని.. హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. కొంతమంది నిరుద్యోగుల నుంచి 5 లక్షల రూపాయలవరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. డీటీపీ, స్టాంపులు తయారు చేసే మరో నలుగురితో వాణి టీంగా ఏర్పడి.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న అనంతరం వారికి ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందించేది. తమకు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నకిలీ బాగోతం మొత్తం బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమె దగ్గర ఉన్న నకిలీ స్టాంపులు, డీజీపీ పేరుతో ఉన్న లెటర్ హెడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాణితో పాటు మరో నలుగురి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరించారు.

మరిన్ని చదవండి ఇక్కడ :  Ammavariki Alankarana: కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. కన్నుల పండగా వీడియో..

Fire in Running‌ Car: రన్నింగ్‌ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)

 Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

 Coal crisis In India: దేశంలో కరెంట్‌ కోత.. బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)