Health Tips: వీటిని తీసుకున్న తర్వాత టీ అస్సలు తాగకండి.. ఇలా చేస్తే ప్రమాదమేనంట..!
జీవితానికి సంబంధించి ఎంత పెద్ద నిర్ణయమైనా అందరూ ఒక కప్పు టీతో చర్చించుకుంటారు. కొందరు ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం టీ తాగుతుంటారు. ఉదయాన్నే నిద్ర నుంచి లేచిన తర్వాత..
జీవితానికి సంబంధించి ఎంత పెద్ద నిర్ణయమైనా అందరూ ఒక కప్పు టీతో చర్చించుకుంటారు. కొందరు ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం టీ తాగుతుంటారు. ఉదయాన్నే నిద్ర నుంచి లేచిన తర్వాత.. అలాగే సాయంత్రం టీ తాగనిదే కొంతమంది ఏం తోచదు. అందుకే చాయ్‌ని ఇష్టంతో కప్పులకు కప్పులు లాగేస్తుంటారు. రిలాక్స్ కోసం టీ తాగడం మంచిదే.. కానీ.. ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు కొన్ని ఆహార పదర్ధాలను తీసుకున్న తర్వాత టీ అస్సలు తగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు చల్లటి పదార్థాలు తిన్నప్పుడు.. లేదా చల్లటి నీరు తాగిన వెంటనే టీ తాగకూడదు. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.నిమ్మరసం తీసుకున్న తర్వాత టీ తాగకూడదు. దీని కారణంగా అపానవాయువు లేదా అసిడిటీ సమస్య కలుగుతుంది. అట్లు, దోశలు, శెనగపిండితో చేసిన ఆహార పదార్థాలను తిన్న తర్వాత టీ తాగకూడదు.. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తీసుకోవడం మానేయాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. దీంతో గుండెకు ప్రమాదకరంగా మారుతుంది. షుగర్ ఉన్నవారు పూర్తిగా టీని మానేయడం మంచిది. తాగాలనిపిస్తే.. షుగర్ ఫ్రీ లేదా.. చక్కెర లేకుండా తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!