Tiger: నల్లమల అటవీ ప్రాంతంలో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత..(వీడియో)
కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగినట్లు అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చలమ రేంజ్ అటవీ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు పేర్కొంటున్నారు. పులి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని.. కార్యాలయానికి తరలించారు. కాగా.. ఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంతకు ముందు కూడా పలు ప్రాంతాల్లో వాహనాలు ఢీకొని అటవీ జంతువులు మరణించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగింది.
కాగా.. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

