Bodh Gaya Ground Report: ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్..! బోధ్ గయ గురించి ఆసక్తికర విశేషాలు.. (వీడియో)

|

Oct 12, 2021 | 8:30 AM

టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే.

టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే. అందులో సిద్ధార్థుడికి జ్ఞానోదయం కల్గించి గౌతమ బుద్ధుడిగా మార్చిన ప్రదేశం బోధ్ గయ వారికి పరమ పవిత్ర స్థలాల్లో ఒకటి. కరోనా కంటే ముందు దేశ, విదేశీ యాత్రికులు, భక్తులతో కిటకిటలాడిన బోధ్ గయలోని మహాబోధి ఆలయంలో… మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం విదేశీ యాత్రికులు పెద్దగా కనిపించకపోయినా, దేశీయ యాత్రికుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోంది.

ఈ ప్రదేశం గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన స్థలంగా భావించి పూజిస్తారు. పడమరవైపు, పవిత్ర బోధి వృక్షం ఉంది. ఇది ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంటుంది… మహాబోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి క్రీస్తూ పూర్వం 3వ శతాబ్దంలో నిర్మించగా.. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. అశోకుడి కాలంలో వజ్రాసనను నిర్మించి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కింద స్థాపించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ అశోకుడి కాలం నాటి శాసనాలు కూడా తవ్వకాల్లో బయటపడి కనిపిస్తాయి. ఆనాటి నుంచి ఇప్పటికీ దాని అసలు రూపం లో నిలబడి, పూర్తిగా ఇటుకలతో నిర్మించిన ప్రాధమిక బౌద్ధ దేవాలయాలలో ఒకటిగా మహాబోధి ఆలయం నిలిచిందని చెబుతుంటారు. ప్రధాన గోపురాన్ని 19వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు. ప్రధాన గోపురం చుట్టూ, అదే శైలిలో నాలుగు చిన్న గోపురాలు కూడా ఉన్నాయి. ఈ మహాబోధి ఆలయం నాలుగు సరిహద్దులు రెండు మీటర్ల ఎత్తులో దగ్గరగా రాతి రైలింగుతో ఉన్నాయి. వీటిపై సూర్యుడు, లక్ష్మి, ఇంకా అనేక భారతీయ దేవీ దేవతల విగ్రహాలతో ఉంటే, కొన్ని రైలింగ్ లు తామరపూలతో కనిపిస్తాయి.

మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ-బౌద్ధ మతాలకు చెందిన పూజారులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక భక్తుల విషయానికొస్తే.. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు అనేక ఇతర మతాలకు చెందిన యాత్రికులు ఈ విశిష్ట చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Krish on Konda Polam: డైరెక్టర్ క్రిష్ సంచలన కామెంట్స్.. కొండపొలం మూవీ నేను చేయకపోతే.. ఆయన చేసేవారు..!(వీడియో)

 Corona-Donald Trump: ట్రంప్‌కు కరోనా షాక్‌..! ట్రంప్ ను దెబ్భ మీద దెబ్బ కొడుతున్న కరోనా.. ఏం జరిగిందంటే..?(వీడియో)

 Manchu Vishnu-Prakash Raj-MAA Elections: ప్రకాష్ రాజ్ రాజీనామాపై ‘మంచు విష్ణు’ సంచలన ప్రెస్ మీట్.. (వీడియో)

 Manchu Vishnu In MAA Elections 2021: విష్ణు విజయానికి కారణాలు ఇవే.. అసలు విషయాలు వెల్లడి.. (వీడియో)