Dumb Phones: 'డంబ్ ఫోన్స్' అంటే ఏంటి..? ఇవి ఇప్పుడెందుకు పాపులర్ అవుతున్నాయో తెలుసా..? వీడియో

Dumb Phones: ‘డంబ్ ఫోన్స్’ అంటే ఏంటి..? ఇవి ఇప్పుడెందుకు పాపులర్ అవుతున్నాయో తెలుసా..? వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 10, 2023 | 8:29 PM

డంబ్‌ఫోన్లు మళ్లీ వస్తున్నాయి. డంబ్‌ ఫోన్లు అంటే ఏమిటో కాదు బేసిక్‌ లేదా ఫీచర్ ఫోన్‌లు. ఐఫోన్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లతో పోలిస్తే వీటిలో ఫీచర్లు చాలా పరిమితం. కేవలం కాలింగ్‌కి sms, text messages పంపేలా..

డంబ్‌ఫోన్లు మళ్లీ వస్తున్నాయి. డంబ్‌ ఫోన్లు అంటే ఏమిటో కాదు బేసిక్‌ లేదా ఫీచర్ ఫోన్‌లు. ఐఫోన్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లతో పోలిస్తే వీటిలో ఫీచర్లు చాలా పరిమితం. కేవలం కాలింగ్‌కి sms, text messages పంపేలా అవసరమైతే రేడియో వినేలా ఉంటాయి. కానీ మీరు ఖచ్చితంగా ఇంటర్నెట్‌కి కనెక్ట్ కాలేరు. ఇవి 1990ల చివర్లో లేదా 2000ల ప్రారంభంలో కొనుగోలు చేసిన ఫోన్‌ల మాదిరిగా ఉంటాయి. ఈ బ్రిక్‌ లేదా ఫ్లిప్ ఫోన్‌లపై ప్రస్తుతం అంతా మనసు పారేసుకుంటున్నారు. వాటి కోసం Google సెర్చ్‌లు 2018 ఇంకా 2021లో 89% పెరిగినట్లు తెలుస్తోంది. UKలో 10 మంది వినియోగదారులలో ఒకరికి డమ్మీ ఫోన్‌ ఉండేది. నేడు భారతదేశంలో 350 మిలియన్లకు పైగా ఫీచర్‌ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఈ పునరుజ్జీవనం వెనక చాలా ట్రెండ్‌ల మాదిరిగానే, సోషల్ మీడియా ఇక్కడ పాత్ర పోషించింది.2017లో రీలాంచ్ అయిన తర్వాత, నోకియా 3310 ఫోన్ లు టిక్‌టాక్ వీడియోల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కనిపించడం ప్రారంభించాయి. దీంతో ఫీచర్‌ ఫోన్‌ని నోకియా 2000 సంవత్సరంలో మళ్లీ తయారుచేసి లాంచ్‌ చేసింది. ఎప్పటికప్పుడు అంచనాలను తారుమారు చేస్తూ అత్యధికంగా అమ్ముడుపోయింది. హై ఎండ్‌ స్పెసిఫికేషన్లు ఉన్న స్మార్ట్‌ మొబైల్‌ల ప్రపంచంలో ఫీచర్‌ ఫోన్లకు డిమాండ్‌ పెరగడం ద్వారా ప్రపంచానికి కొత్త ప్రత్యామ్నాయాన్ని చూపించినట్లైంది. వాస్తవానికి, పాత కాలం నాటి వస్తువులు మనకు ఒక తీపి గుర్తుగా మిలిగిపోతుంటాయి. కొంత మంది అయితే ఆ పాత వస్తువుల్లో తమ జీవితాన్ని గుర్తు చేసుకుంటారు. చిన్నపాటి జ్ఞాపకాలతో ముడిపడిన అనుబంధం ఉంటుంది. ఈ అంశం బాగా దోహదపడింది. ఈ ఫోన్‌లను ఫంక్షనాలిటీ కావచ్చు లేదా పెర్ఫార్మెన్స్ పరంగా ప్రీమియం ఫోన్లతో పోల్చడం సాధ్యం కాదు, కానీ వీటికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌, ఎక్కువ మన్నిక, పాకెట్ ఫ్రెండ్లీగా ఇవి 1500 రూపాయల కంటే తక్కువలో లభిస్తాయి. ఫీచర్‌ఫోన్‌ నుండి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవుతున్న భారతీయుల సంఖ్య తగ్గుతోందని నివేదికలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 35 లక్షలు మాత్రమే. 2అయితే ఈ ఫోన్‌లకు అనుకూలంగా ఉండే అతిపెద్ద అంశం ఏంటంటే ఫీచర్‌ ఫోన్లు ప్రజలను తెలివిగా మార్చగలవు. స్మార్ట్‌ఫోన్‌లు మన మేధస్సు పై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు తేల్చాయి. అవి మన అటెన్షన్‌ స్పాన్‌ని కూడా తగ్గిస్తాయి. డూమ్ స్క్రోల్ తరచుగా ఇందుకు కారణం. డూమ్ స్క్రోల్ అంటే ఏంటో తెలుసా? మీరు ఎంత కిందికి స్క్రోల్ చేసినా అంతం లేని అనంత సమాచారం వస్తూనే ఉండటం. చాలా మందికి ఫీచర్‌ఫోన్లకు ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. ఇవి ప్రజలను మరింత ఉత్పాదకంగా, మరింత చురుగ్గా ఉండేలా చేస్తాయి,నోటిఫికేషన్‌ల వెల్లువ మన మెదడులో సంతోషకర రసాయనాల విడుదలకు సహకరించవు. ఫలితంగా మీ ఫోన్‌కి బానిసలుగా మారుతూ ఉండటమే. అందుకేనేమో ప్రజలు ఫ్యాన్సీ స్మార్ట్‌ఫోన్‌లను వదులుకుంటున్నారు ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు.చాలా మంది గోప్యత ప్రైవసీ కోల్పోతున్నారు. సమయాన్ని ఆదా చేయడానికి ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు బదులుగా మన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయి. సహోద్యోగి పుట్టినరోజు ఇమెయిల్ ద్వారానే తెలుసుకుంటున్నాం తప్ప చివరిసారిగా ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం? లేక మన గమ్యస్థానానికి దారి చూపించమని స్థానికుల్ని అడగడం మానేసాం. యాప్‌లో టాక్సీ చాలా ఈజీగా బుక్ చేస్తున్నాం కానీ మన డేటాను కంపెనీలు ఇతరులకి అమ్మేస్తున్నాయన్న విషయం మనకు పట్టదు. తద్వారా మనం సంపాదించే విలువైన సమయాన్ని మళ్లీ సోషల్ మీడియా బ్రౌజింగ్‌తో వృధా చేస్తున్నాం. అంటే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ వాడటం మానాలా అన్నది మీ ఇష్టం. కొందరికి ఇది తెలివైన ఎంపిక కావచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 10, 2023 07:58 PM