Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deers-Farmers-Crop fields: జింకల పేరు చెబితే హడలిపోతున్న రైతన్నలు.. ఎందుకో తెలిసా..?(వీడియో)

Deers-Farmers-Crop fields: జింకల పేరు చెబితే హడలిపోతున్న రైతన్నలు.. ఎందుకో తెలిసా..?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 28, 2021 | 6:48 PM

జింకల పేరు వింటేనే హడలిపోతున్నారు అక్కడి రైతులు. కాపాడండి బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. అన్ని శక్తులను అడ్డుకుంటున్నాం కానీ, ఈ జింకల నుంచి పంటలు కాపాడుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ఇంతకీ జింకలకు రైతన్నలు ఎందుకు భయపడుతున్నారో తెలుసా.


జింకల పేరు వింటేనే హడలిపోతున్నారు అక్కడి రైతులు. కాపాడండి బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. అన్ని శక్తులను అడ్డుకుంటున్నాం కానీ, ఈ జింకల నుంచి పంటలు కాపాడుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ఇంతకీ జింకలకు రైతన్నలు ఎందుకు భయపడుతున్నారో తెలుసా. వేల రూపాలయ పెట్టుబడులు పెట్టి పంటచేలు వేస్తే.. ఆ పంట చేలలో చెంగు చెంగున ఎగురుకుంటూ పంటలను నాశనం చేస్తున్నాయి. దాంతో అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వివరాల్లోకెళితే.. నారాయణ పేట జిల్లాలోని మక్తల్, ఊట్కూరు, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో జింకలు రైతు కంట నీరు తెప్పిస్తున్నాయి. పొలాల్లో చెంగుచెంగున ఎగురుతూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.

సకాలంలో వర్షాలు కురవడంతో వానాకాలం సీజన్‌లో పత్తి, కంది, ఆముదం తదితర పంటలను సాగు చేశారు రైతులు. చాలామంది పత్తి పంట వైపే మొగ్గుచూపుతున్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టారు. పంటలు మొలక దశలో ఉన్నపుడు మందలుగా వచ్చి పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో పంటలు మొదటి దశలోనే ధ్వంసమయిపోతున్నాయి. పత్తి కాయలను, కంది బుడ్డలను సైతం వదలడం లేదు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వాటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన మాగనూరు, కృష్ణా మండలాల్లోనే కాకుండా మక్తల్, ఊట్కూరు, నర్వ పరిధిలోనూ జింకలు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Tirupati Rain: తిరుపతిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. నీళ్లలో నిల్చిపోయిన వాహనం ఊపిరాడక యువతి మృతి..(వీడియో)

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు.. డ్రగ్స్ కేసులో మరో మలుపు.. మరొక ప్రముఖుడు అరెస్ట్.. (లైవ్ వీడియో)