Calcium supplements: సప్లిమెంటరీ టాబ్లెట్స్ తీసుకునేవారికి హెచ్చరిక..! తెలుసుకోకపోతే మరింత ఇబ్బంది పడే అవకాశం.. (వీడియో)

|

Nov 08, 2021 | 7:24 AM

మనిషి శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే ఒంట్లో సరిపడినంత కాల్షియం ఉండాలి. కాల్షియం సరిగా అందకపోతే చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలా వరకు మనం తీసుకునే ఆహారంతోనే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది.


మనిషి శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే ఒంట్లో సరిపడినంత కాల్షియం ఉండాలి. కాల్షియం సరిగా అందకపోతే చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలా వరకు మనం తీసుకునే ఆహారంతోనే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. కానీ కొందరిలో మాత్రం కాల్షియం లేమి కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారి కోసమే వైద్యులు కాల్షియం ట్యాబ్లెట్లను వాడమని సూచిస్తుంటారు. అయితే ఇది హద్దు మీరితో మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కాల్షియం అవసరమే కానీ.. ఎక్కువైతే కూడా ప్రమాదమని చెబుతున్నారు.

సాధారణంగా పురుషులకు నిత్యం 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం ఉంటుంది. అదే స్త్రీలు అయితే నిత్యం 1200 నుంచి 1500 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం తీసుకోవాలి. పిల్లలకు 1300 నుంచి 2500 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం అవుతుంది. ఈ మోతాదులోనే నిత్యం కాల్షియం అందేలా చూసుకోవాలి. ఎక్కువైతే మాత్రం దుష్ఫ్రభాలు తప్పవు. ముఖ్యంగా శరీరంలో కాల్షియం స్థాయి ఎక్కువైతే.. కిడ్నీలు దాన్ని ఫిల్టర్‌ చేయలేవు. ఫలితంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. అలాగే కాల్షియం ఎక్కువైతే బీపీ కూడా పెరుగుతుంది. కాల్షియం పరిమాణం ఎక్కువైతే ఎముకలకు దృఢంగా మారకపోగా పెళుసుగా మారుతాయి. దీంతో అవి సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సప్లిమెంటరీ ట్యాబ్లెట్లు వాడే వారు వైద్యుల సూచనలు తీసుకుంటూ వాడడం మంచిదంటున్నారు నిపుణులు.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…