Adhaar Xerox: ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు ఎక్కడంటే అక్కడ ఇస్తున్నారా..? అయితే ముప్పు తప్పదంటోంది ప్రభుత్వం.

|

Jun 05, 2022 | 10:00 AM

ప్రస్తుతం ఆధార్‌ కార్డు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే.. ఎక్కడపడితే అక్కడ ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు ఇస్తుంటాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో మనకు తెలియదు.. ఆ విషయం తెలుసుకోం కూడా. దీంతో ఆధార్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి.


ప్రస్తుతం ఆధార్‌ కార్డు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే.. ఎక్కడపడితే అక్కడ ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు ఇస్తుంటాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో మనకు తెలియదు.. ఆ విషయం తెలుసుకోం కూడా. దీంతో ఆధార్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్‌, సిమ్‌.. ఇలా ప్రతిదానికీ మనం ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానించి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆధార్‌ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ముప్పు తప్పదు.దీనిపై ప్రభుత్వం తాజాగా పౌరులను అప్రమత్తం చేసింది. అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్‌ నెంబరు ఉన్న కార్డు ఫొటోకాపీని ఇవ్వాలని చెబుతోంది. అవసరం లేని దగ్గర మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డుని ఇవ్వాలని కోరింది. హోటల్స్‌, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించి ఉండే ఆధార్‌ పత్రమే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌. దీనిపై మీ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్‌ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఉపయోగపడుతుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడం కోసం UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్‌ ఆధార్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేముందు అక్కడ ఉన్న ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ‘సెండ్‌ ఓటీపీ’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌తో జత చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్‌ ద్వారా మీకు వస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 05, 2022 09:58 AM