Organ Donation: ఎయిమ్స్ చరిత్రలోనే ఇదో మైలురాయి.. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆరేళ్ల చిన్నారి..!

|

May 25, 2022 | 9:15 AM

ప్రతి జీవికి మరణం తథ్యం.. కొందరు మాత్రం మరణించీ చిరంజీవులవుతారు.. కొందరు తాము మరణిస్తూ.. తమ అవయవాలను దానం చేసి.. మరికొందరి జీవితంలో వెలుగులు నింపుతారు. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి.. తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అంతేకాదు..


ప్రతి జీవికి మరణం తథ్యం.. కొందరు మాత్రం మరణించీ చిరంజీవులవుతారు.. కొందరు తాము మరణిస్తూ.. తమ అవయవాలను దానం చేసి.. మరికొందరి జీవితంలో వెలుగులు నింపుతారు. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి.. తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అంతేకాదు.. ఎయిమ్స్ (AIIMS)చరిత్రలో ఆర్గాన్స్ డొనేషన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగానిలిచింది. నోయిడాలో రోలి ప్రజాపతి అనే 6 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. రోలీ తలకు తీవ్ర గాయం కారణంగా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రిఫర్ చేశారు. చిన్నారి మెదడులో బుల్లెట్ చిక్కుకుంది. మెదడు పూర్తిగా దెబ్బతింది. చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలం కావడంతో వైద్యులు చిన్నారిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.వైద్యుల బృందం తల్లిదండ్రులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. దీంతో వారు ముందుకు వచ్చారు. కాలేయం, మూత్రపిండాలు, కార్నియాలు, గుండె కవాటం రెండూ విరాళంగా ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు. తమ చిన్నారి అవయవాలను దానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడిన రోలీ తల్లిదండ్రులను ఎయిమ్స్ వైద్యుడు అభినందించారు. ఈ అవయవ దానంతో.. రోలీ ఢిల్లీలోని ఎయిమ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన దాతగా నిలిచింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 25, 2022 09:15 AM