Khammam: మరి ఇంతకన్నా పాపం ఉంటుందరా.. అన్నం తింటుండగా కూర వేయలేదని..
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోర సంఘటన జరిగింది. అన్నం తింటుండగా కూర వేయలేదని రవి అనే వ్యక్తి రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్రగాయాలైన రుక్మిణిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని కోపంతో రుక్మిణి అనే మహిళపై రవి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఇద్దరూ కిటికీలు తయారు చేసే ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. భోజనం సమయంలో చిన్న విషయంపై మాటామాటా పెరిగి రవి ఆగ్రహంతో రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

