తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం

Updated on: Oct 25, 2025 | 9:14 AM

చెయ్యెత్తి బస్సు ఆపమని రిక్వెస్ట్‌ చేసినా ఆపని ఈ రోజుల్లో...ప్రయాణికులకు స్వాగతం..సుస్వాగతం అంటూ...స్వయంగా బస్సు డ్రైవర్ ప్రయాణికులను చూడగానే బస్సు ఆపేసి, వారికి బస్సులోకి స్వాగతం చెబుతుడంటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బస్సులో ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చినప్పటినుంచి ఆర్టీసీ బస్సుల్లో కొట్లాటలు ఎక్కువైపోయాయి.

ఈ క్రమంలో ఆర్టీసీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులను ఆత్మీయంగా పలకరిస్తూ బస్సులోకి ఆహ్వానిస్తున్నారు. బస్సులో సీట్ల కోసం కొట్టుకోకుండా ప్రశాంతమైన ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. సాధారణంగా విమానాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. విమానం బయలుదేరే ముందు ఆ విమానం ఎక్కడికి వెళ్తుంది? ఎంత సమయం పడుతుంది? ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలు ఎయిర్‌ హోస్టెస్‌ వివరిస్తారు. అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ప్రయాణికులకు తమను తాము పరిచయం చేసుకుంటూ, బస్సు వివరాలు అన్ని వివరిస్తున్నారు. ప్రయాణికులకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి RTC డిపో కు చెందిన మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ ఆర్టీసీ ఎండి సూచన మేరకు ప్రతి బస్సు ప్రయాణానికి ముందు కండక్టర్ లేదా డ్రైవర్ ప్రయాణికులను ఉద్దేశించి ప్రయాణికు లందరికీ స్వాగతం అంటూ ఆత్మీయంగా పలకరించాలి. బస్సు ఎక్కడినుండి ఎక్కడకు ప్రయాణిస్తుందో తెలుపుతూ ఎంత సమయం పడుతుందో ప్రయాణికులకు వివరిస్తూ … ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని ప్రయాణికులను RTC సిబ్బంది కోరడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుందని, సౌకర్యమంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సు లోనే ప్రయాణం చేయాలని, ప్రయాణికులను కండక్టర్ ఆత్మీయంగా పలకరిస్తూ వివరించటం అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమికి రెండో చంద్రుడు !! 2083 వరకు మనతోనే

పొలం పనుల్లో కూలీలు బిజీ.. అంతలోనే చిరుత

తెలంగాణలో రాకాసి ఏనుగు శిలాజం.. బిర్లా సైన్స్‌ మ్యూజియంలో ప్రదర్శన

Cyclone Alert: తరుముకొస్తున్న తుఫాన్‌.. తీరం దాటేది అక్కడే

దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్