Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…

| Edited By: Ram Naramaneni

Jul 03, 2024 | 1:46 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్ గుచ్చుకుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. మంచంపై ఆడుకుంటూ కిందపడటంతో రియాన్షిక చెవి పైభాగంలోపలికి పెన్ చొచ్చుకుపోయింది. దీంతో తీవ్ర తీవ్ర రక్తస్రావం అయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ను నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్‌లో పెన్ గుచ్చుకుని నాలుగు సంవత్సరాల రియాన్షిక మృతి చెందింది. తన ఇంట్లో మంచం మీద కూర్చొని బుక్స్‌లో రాసుకుంటూ ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కింద పడటంతో రియాన్షిక చెవి పైభాగం లోపలికి పెన్ను చొచ్చుకుపోయింది.  తీవ్ర రక్తస్రావం కావడంతో పాపను ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. అక్కడి డాక్టర్లు సర్జరీ చేసి.. నాలుగు ఇంచెలు లోనికి చొచ్చుకెళ్లిన పెన్నును బయటకు తీశారు. సర్జరీ అనంతరం బ్రెయిన్‌కు ఇన్ఫెక్షన్ కావడంతో చిన్నారి రియాన్షిక ప్రాణాలొదిలింది. రియాన్షిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Jul 03, 2024 01:45 PM