Ganesh Chaturthi: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తజనం
Khairatabad Ganesh

Ganesh Chaturthi: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తజనం

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:17 PM

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని సహా రాజకీయ ప్రముఖులు ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలివచ్చారు.

ఖైరతాబాద్ లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. వినాయకుడికి ఆనవాయితీగా పద్మశాలీలు పట్టు వస్త్రాలు, యజ్ఞోపవేతం సమర్పించారు. గుర్రపు బగ్గీపై భారీ పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. ఒగ్గుడోలు, డప్పులు, నృత్యాల మధ్య ర్యాలీగా వచ్చి స్వామివారికి 50 అడుగుల భారీ యజ్ఞోపవేతం సమర్పించారు పద్మశాలీలు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని సహా రాజకీయ ప్రముఖులు గణనాధున్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. పంచముఖ మహాలక్ష్మి గణపతిగా కనువిందు చేస్తున్నారు ఖైరతాబాద్‌ గణనాథుడు. ఈసారి 50 అడుగుల విగ్రహాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఆ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

Published on: Aug 31, 2022 10:20 AM