విజయవాడ దుర్గగుడిలో భక్తులకు తప్పిన ప్రమాదం

Updated on: Jan 10, 2026 | 5:54 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద స్వల్ప విద్యుత్ షాక్ సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించి కరెంట్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించిన అనంతరం ప్రసాద పంపిణీ యథావిధిగా కొనసాగింది. భక్తులు సురక్షితంగా ప్రసాదం స్వీకరించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో విద్యుత్ షాక్ సంభవించింది. కరెంట్ షాక్ రావడంతో వెంటనే అప్రమత్తమైన దుర్గగుడి అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం, దుర్గగుడి అధికారులు, ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ షాక్‌కు గల కారణాలను తెలుసుకుని, సమస్యను వెంటనే పరిష్కరించారు. అధికారులు సత్వర చర్యలు తీసుకోవడంతో, ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్