నేటి తాజా వార్తా.. నగరం లో ముసుగు దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త

Updated on: Dec 29, 2025 | 4:24 PM

కామారెడ్డిలో ముసుగు దొంగల ముఠా సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. మారణాయుధాలతో కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు సీసీటీవీలలో రికార్డయ్యాయి. ఓల్డ్ ఎస్‌పీఆర్, ఆర్‌కేనగర్, జయశంకర్ కాలనీలలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. పోలీసులు అప్రమత్తమై పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అరెస్టయినప్పటికీ, దొంగతనాలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.

దొంగల కారణంగా కామారెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! చీకటి పడితే చాలు.. మారణాయుధాలతో ముసుగు దొంగల ముఠా వీధుల్లోకి ఎంటరవుతోంది. కామారెడ్డిలో ముసుగు దొంగల ముఠా హల్‌చల్‌ చేస్తోంది. మారణాయుధాలతో పలు కాలనీల్లో దొంగలు రెక్కీ నిర్వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓల్డ్ ఎస్‌పీఆర్, ఆర్‌కేనగర్ కాలనీల్లో దొంగల సంచారం దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల సంచారంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైంది. ఆయా చోట్ల గడ్డపారతో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరి నుంచి బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో దొంగల అలజడి కలకలం రేపింది. పట్టణంలోని జయశంకర్‌ కాలనీలో వేకువజామన దాదాపు 3 గంటల ప్రాంతంలో దొంగలు సంచరిస్తూ చోరీలకు యత్నించారు. కుక్కలు మొరగడంతో కొందరు కాలనీవాసులు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. వారు బయటకు రావడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారని కాలనీవాసులు తెలిపారు. ముసుగులు ధ రించిన ముగ్గురు కాలనీల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దొంగల సంచారం పట్టణ వాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. కాలనీల్లో పోలీసు పెట్రోలింగ్‌ పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL నుంచి అద్భుత ప్లాన్‌!రూ. 251కే 100 GB డేటా

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర