బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పూర్తి స్వస్థతతో మళ్లీ ప్రజాజీవితంలోకి వస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. జీవితంలో ఏదిజరిగినా మన మంచికే అనుకోవాలన్న పాల్.. మరింత యాక్టివ్‌గా కేసీఆర్ ఉండబోతున్నారని చెప్పారు. యశోద ఆస్పత్రికి వచ్చిన ఆయన.. మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ప్రజలంతా కేసీఆర్ కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7న గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ కు చికిత్స కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..