Jubilee Hills By Election: కొనసాగుతోన్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌.. లైవ్ వీడియో

Updated on: Nov 11, 2025 | 7:57 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. ఎన్నిక కోసం ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఓటర్లు పొద్దున్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈసారి పోలింగ్ శాతం పెంచడం రాజకీయ పార్టీలతో పాటు, ఈసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. ఎన్నిక కోసం ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఓటర్లు పొద్దున్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈసారి పోలింగ్ శాతం పెంచడం రాజకీయ పార్టీలతో పాటు, ఈసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎన్నికల చరిత్రలో తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. 139 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ తీరును పర్యవేక్షించేందుకు 139 డ్రోన్లను వాడుతున్నారు. ఉప ఎన్నిక పోలింగ్‌ సరళి పర్యవేక్షించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ అమలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్‌ సందర్భంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ పెట్టారు పోలీసులు. కేంద్రానికి రెండొందల అడుగుల దూరం వరకు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని హెచ్చరించారు.