రైలు ప్రయాణికులకు అలర్ట్..
భారతీయ రైల్వేలు 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నియమం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన తొలి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. తత్కాల టిక్కెట్లకు ఇప్పటికే ఆధార్ లింక్ తప్పనిసరి కాగా.. ఈ కొత్త నియమం ద్వారా అక్రమాలను నియంత్రించి నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు దొరకే అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలకమైన ప్రకటన చేసింది. 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల టిక్కెట్లకు ఆధార్ లింక్ తప్పనిసరి అయినప్పటికీ ఈ కొత్త నిర్ణయంతో జనరల్ కోటా టిక్కెట్ల బుకింగ్‌లోనూ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ఈ కాల వ్యవధిలోనే అధిక డిమాండ్ ఉండటం, అక్రమాలను నివారించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రయాణికులు అక్టోబర్ 1 లోగా తమ IRCTC ఖాతాకు ఆధార్‌ను లింక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తుంది.
Published on: Sep 17, 2025 04:45 PM
వైరల్ వీడియోలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

