నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఏపీపీఎస్సీ 5 నోటిఫికేషన్ల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్ మెన్, ఏఈఈ, హార్టికల్చర్ ఆఫీసర్ వంటి 21 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. అక్టోబర్ 7, 8 తేదీల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టుల భర్తీకి ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లు జూనియర్ లెక్చరర్ (రెండు పోస్టులు), బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఒక పోస్టు), డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్ టు, టెక్నికల్ అసిస్టెంట్ (13 పోస్టులు), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మూడు పోస్టులు), హార్టికల్చర్ ఆఫీసర్ (రెండు పోస్టులు) పోస్టుల భర్తీకి సంబంధించినవి. జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు అక్టోబర్ 7వ తేదీ చివరి తేదీ కాగా.. మిగిలిన పోస్టులకు అక్టోబర్ 8వ తేదీ చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది

