AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలాక్‌ చెప్పిన భర్తను చెప్పుతో కొట్టిన భార్య వీడియో

తలాక్‌ చెప్పిన భర్తను చెప్పుతో కొట్టిన భార్య వీడియో

Samatha J
|

Updated on: Sep 17, 2025 | 4:56 PM

Share

అదనపు కట్నం కోసం వేధిస్తూ కొట్టడమే కాకుండా కేసుపెట్టిన భార్యకు కోర్టు ముందే తలాక్‌ చెప్పాడు ఓ భర్త. తన పిల్లలను తనకు దూరం చేయడమే కాకుండా ఇంట్లోంచి బయటకు గెంటేసి ఇప్పుడు తలాక్‌ చెప్పి తనపై దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా ఆ మహిళలో సహనం నశించింది. వెంటనే చెప్పుతీసుకొని భర్తను ఎడాపెడా వాయించేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘2018లో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భర్త కొడుతూ అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. తనకు ఇద్దరు కుమార్తెలు జన్మించాక ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఆ సమయంలో కోర్టు సాయం కోరడం తప్ప తనకు వేరే మార్గం లేక భరణం కోసం కేసు పెట్టానని తెలిపింది. ఆర్థిక సాయం కోరుతూ దావా వేశానని వివరించింది. దీంతో పిల్లలను తనవద్దనుంచి బలవంతంగా లాక్కెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుపై రాంపూర్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరువురూ కేసు విచారణకు హాజరయ్యారు. భర్త తన తండ్రితో కలిసి కోర్టుకు వచ్చాడు. విచారణ అనంతరం కోర్టునుంచి బయటకు వచ్చిన బాధితురాలిని తండ్రి, కొడుకులిద్దరూ వెంబడిస్తూ దుర్భాషలాడుతూ.. కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో, మామ ప్రోద్బలంతో భర్త అక్కడికక్కడే మూడుసార్లు ‘తలాక్..’ చెప్పి ఆమెపై దాడికి దిగినట్టు బాధితురాలు వివరించింది. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం చెప్పుతో భర్తపై దాడి చేసినట్లు తెలిపింది. తన పిల్లలను తనకు దూరం చేశారని, తన జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇప్పుడు అన్యాయంగా తనపై దాడిచేస్తే ఎలా సహిస్తానని వాపోయింది. అందుకే వారిని కొట్టానని, తనకు న్యాయం కావాలని, భరణంతోపాటు తన పిల్లలను తనకు అప్పగించి అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో

Published on: Sep 17, 2025 04:55 PM