Cyclone: తీవ్ర తుఫానుగా మారిన అల్పపీడనం.. విరుచుపడనున్న తుఫాన్.

Updated on: Oct 23, 2023 | 9:50 PM

అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారిందని, ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారుతోందని ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అక్టోబరు 22 మధ్యాహ్నానికి మరింతగా బలపడి, తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపింది. ప్రస్తుతం తేజ్‌ తుఫాను ప్రభావంతో గంటకు 88 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారిందని, ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారుతోందని ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అక్టోబరు 22 మధ్యాహ్నానికి మరింతగా బలపడి, తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపింది. ప్రస్తుతం తేజ్‌ తుఫాను ప్రభావంతో గంటకు 88 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి వేగం మరింత పెరిగితే తీవ్ర తుఫానుగా మారుతుందన్నారు. గుజరాత్‌పై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండడంతో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని అంచనావేసింది. అయితే తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దాని పక్కనే ఉన్న యెమెన్ దక్షిణ తీరాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దిశను మార్చుకునే అవకాశం కూడా ఉండడంతో ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 23, 2023 07:31 PM