కారులో ఏసీ ఆన్ చేస్తే.. మైలేజీ తగ్గుతుందా?

Updated on: Jul 29, 2025 | 9:50 PM

కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల మైలేజీ తగ్గుతుందని చాలా మంది అంటుంటారు. అయితే కారులో ఏసీ ఆన్ చేస్తే దాని ప్రభావం మైలేజీపై పడుతుంది. ఇంతకీ కారులో ఏసీని గంటసేపు ఆన్‌లో ఉంచితే పెట్రోల్ ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? కారు డ్రైవర్లు సాధారణంగా వేసవిలో ఏసీని ఉపయోగిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దీనిని వర్షాకాలం, చలికాలం అనే తేడా లేకుండా ఉపయోగిస్తున్నారు.

మరోవైపు ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఒక గంట పాటు కారు ఏసీ వాడితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? అంతేకాకుండా అది కారు మైలేజీపై కూడా ప్రభావం పడుతుందా? ఇప్పుడు చూద్దాం. మీరు కారు మైలేజీ గురించి ఆందోళన చెందుతుంటే, అది కారు రకాన్ని బట్టి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల ఇంజన్‌లు సాధారణంగా చిన్నవి. తక్కువ శక్తివంతంగా ఉంటాయి. హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారులో గంటసేపు ఏసీని ఉపయోగిస్తే, ఇంధన వినియోగం గంటకు 0.2 నుంచి 0.4 లీటర్లు. అదే సమయంలో ఎస్‌యూవీలో ఒక గంట పాటు ఏసీని నడపడానికి గంటకు 0.5 నుండి 0.7 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. అలాగే, కారు AC ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుంది అనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కారు చిన్నగా ఉంటే కారు ఇంజిన్ తక్కువ శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు AC నడుస్తున్నప్పుడు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కారు పరిమాణం పెద్దగా ఉంటే, అంటే మీరు SUVలో AC నడుపుతున్నట్లయితే ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం మత్తులో.. పామును కసా కసా కొరికి ..

రంగు మారిన టైల్స్‌.. ఏంటా అని చెక్‌ చేయగా షాక్‌

వామ్మో.. అద్దె ఇంటికి రూ. 23 లక్షలు అడ్వాన్స్‌

కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు.. కారణమేంటంటే..?

మీరు జిమ్‌కి వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే