వారానికి ఎంత బరువు తగ్గొచ్చు ?? నిపుణుల సలహా ఏమిటి ??

|

Jun 03, 2024 | 9:35 PM

దేశంలో ఊబకాయం సమస్య ఓ ముప్పుగా మారింది. దేశ జనాభాలో 25 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీన్నుంచి బయటపడేందుకుగానూ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మొదలు వ్యాయామం, చికిత్స వంటి ప్రయత్నాలతో కొందరు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఇటీవల కొన్ని కీలక సిఫార్సులు చేసింది. బరువు తగ్గేందుకు త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది.

దేశంలో ఊబకాయం సమస్య ఓ ముప్పుగా మారింది. దేశ జనాభాలో 25 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీన్నుంచి బయటపడేందుకుగానూ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మొదలు వ్యాయామం, చికిత్స వంటి ప్రయత్నాలతో కొందరు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఇటీవల కొన్ని కీలక సిఫార్సులు చేసింది. బరువు తగ్గేందుకు త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరగడానికి జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్‌ చేసిన ఆహారం విపరీతంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేమి వంటివి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. కేవలం కెలోరీలపై దృష్టిపెట్టడం కాకుండా.. సమతుల ఆహారం కోసం పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇవి ఆకలి తగ్గించి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో దోహదపడతాయి. బరువు తగ్గే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వారానికి 0.5 కిలోల బరువు తగ్గడం ఎంతో సురక్షితం. తద్వారా కండరాలకు నష్టం కలగకుండా, శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. అధిక బరువు ఉన్నప్పటికీ శరీర కనీస అవసరాల కోసం 1000 కిలోల కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వ్యాయామం చేసే సమయంలో నీరసంగా అనిపించరు. విటమిన్లు, మినరల్స్‌ వంటివాటితో కూడిన ఆహారంపై దృష్టిపెట్టాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salman Khan: డేంజర్లో సల్మాన్.. AK-47తో కాల్పులకు కుట్ర

Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్

Vishwak Sen: మూవీ చూడకుండా రివ్యూలు ఎలా ఇస్తారు ?? ఇచ్చిపడేసిన విశ్వక్

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్

Family Star: ఫ్యామిలీ స్టార్ కొంప ముంచిన గ్రాఫిక్స్ దోశ

Follow us on