Telangana: తెలంగాణ వెదర్ రిపోర్ట్.. వాతావరణ శాఖ అధికారిణి మాటల్లో

Updated on: May 08, 2024 | 1:03 PM

తెలంగాణలో మంగళవారం వర్షం దంచి కొట్టింది. బుధవారం కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ చెబుతోంది. మరి సోమవారం పోలింగ్ ఉంది.. ఆ రోజు పరిస్థితి ఏంటి..? వాతావరణ శాఖ అధికారిణి మాటల్లో తెలుసుకుందాం పదండి......

మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైందన్నారు టీవీ9తో వాతావరణ శాఖ అధికారి శ్రావణి. హైదరాబాద్‌లో 8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. బుధవారం సాయంత్రం ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని.. వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి.. అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. మే 13న తెలంగాణ లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆ రోజు కూడా మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రావణి. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం పదండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 08, 2024 01:00 PM