మ్యాన్‌హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు
వర్షాకాలం వచ్చిందంటేనే హైదరాబాద్ ప్రజల్లో దడ మొదలవుతుంది. చిన్నపాటి చిరు జల్లులకే రహదారులపై వరద ఉప్పొంగుతుంది. కిలోమీటర్ దూరం వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. దీనికితోడు ఎక్కడ మ్యాన్ హోళ్లు ఉంటాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాలి. పలువురు వాహనదారులు మ్యాన్ హోళ్లలో పడి మరణించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.
వర్షాకాలం వచ్చిందంటేనే హైదరాబాద్ ప్రజల్లో దడ మొదలవుతుంది. చిన్నపాటి చిరు జల్లులకే రహదారులపై వరద ఉప్పొంగుతుంది. కిలోమీటర్ దూరం వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. దీనికితోడు ఎక్కడ మ్యాన్ హోళ్లు ఉంటాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాలి. పలువురు వాహనదారులు మ్యాన్ హోళ్లలో పడి మరణించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అయితే, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్ హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును వేస్తున్నారు జలమండలి సిబ్బంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 25వేలకుపైగా లోతైన మ్యాన్ హోళ్లు ఉన్నాయి. వీటిపై సేప్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతోపాటు, వాటిని ప్రజలు తేలికగా గుర్తించేందుకు ఎరుపు రంగు పూస్తున్నారు. తద్వారా వానా కాలంలో, వర్షాలు పడిన సమయంలో మ్యాన్ హోళ్లలో పడకుండా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంతెనపై కారు.. ఎదురుగా పెద్ద ఎలుగుబంటి.. ఏం చేశారంటే ??
Dhanush: అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డ్ నామినేషన్స్‌లో ధనుష్ సినిమా
Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్ ఓపికకు దండం !!